• Login / Register
  • Group 1 Main Exam | గ్రూప్‌-1లో మాస్ కాపీయింగ్‌కు ప్ర‌య‌త్నించిన మ‌హిళా

    చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి..
    ఇబ్రహీంపట్నం సీవీఆర్‌ కాలేజీలో చోటుచేసుకున్న సంఘ‌టన
    ఆ మ‌హిళ‌ను త‌ర్వాత పరీక్షలు రాయకుండా డీబార్ చేసిన అధికారులు

     
    HYDERABAD |  రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్ ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి.     కాపీయింగ్‌కు పాల్పడిన ఒక మ‌హిళా అభ్యర్థిని ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా  పట్టుకున్నారు. ఆమెను విచారించిన అనంత‌రం ప‌రీక్ష‌ల‌కు డీబార్‌ చేశారు. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లో భాగంగా  శుక్రవారం జరిగిన ‘ఎకనామీ అండ్‌ డెవలప్‌మెంట్‌’ పేపర్‌ పరీక్షకు ఇబ్రహీంపట్నంలో ఉన్న‌ సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఖానాపూర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళా అభ్యర్థి పరీక్షకు హాజరైంది. ఆమె ఎక‌నామిక్స్ స‌బ్జెక్టుకు చెందిన  కొన్నిగణాంకాలను తన చేతిపై రాసుకొని వచ్చినప్పటికీ తనిఖీ సమయంలో సిబ్బంది గుర్తించలేదు. ఆ త‌ర్వాత ప‌రీక్ష హాల్లోకి వెళ్లాక అభ్యర్థులకు ఆన్సర్లు షీట్లు అందజేయగానే లక్ష్మి ఆ ఆన్సర్‌షీట్‌ వెనుక వైపు ఉన్న‌ రఫ్‌షీట్‌లో రాయడం షురూ చేసింది. అయితే ప‌రీక్ష‌కు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇవ్వకముందే ఆమె ఆన్సర్లు రాయడాన్ని గుర్తించిన‌ ఇన్విజిలెటర్లు తని ఖీలు నిర్వ‌హించ‌గా..  ఆ మ‌హిళా చేతిపై జ‌వాబులు రాసుకొచ్చినట్లు గుర్తించారు. ఆ త‌ర్వాత ఆమెను డీబార్‌ చేయించారు. అయితే ఈ ఘటనలో మరో వాదన వినిపిస్తున్నది. అయితే ఆ మహిళా అభ్యర్థి చీరకొంగులో చీటీ పెట్టుకొచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.  
    ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం నిర్వ‌హించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పేపర్‌-4 పరీక్షకు 67.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఈ ప‌రీక్ష‌ల‌కు 31,383 మందికి బ‌దులుగా 21,195 మంది రాసినట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. 
    *సీల్‌ లేకపోవడంపై అనుమానాలు : సతీశ్‌రెడ్డి
    గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత వై సతీశ్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా ఆరోపించారు. ఈ మేరకు సీల్‌ ఉన్న, సీల్‌ లేని ప్రశ్నపత్రాలను పోస్టుచేశారు. సైనిక్‌పురి డిఫెన్స్‌కాలనీ భవన్స్‌ శ్రీరామకృష్ణ విద్యాలయం పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంపై సీల్‌ లేకపోవడంపై ఆయ‌న అభ్యంతరం వ్యక్తంచేశారు. 
    *  *  *

    Leave A Comment